మొటిమ కూడా ముత్యమేలే!

‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..’ అని అప్పుడెప్పుడో పాడారు గాన గంధర్వుడు.

Published : 27 Apr 2024 00:03 IST

‘అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే..’ అని అప్పుడెప్పుడో పాడారు గాన గంధర్వుడు. దాన్ని నిజం చేయడానికా అన్నట్టుగా కొత్త ట్రెండ్‌కి తెర లేపారు చక్కనమ్మలు. అదే ఫ్రెకిల్‌ టాటూ ట్రెండ్‌. ఔను గురూ.. మొటిమల టాటూలే. మన దగ్గరకి ఇంకా రాలేదుగానీ.. పశ్చిమదేశాల్లోని కుర్ర అమ్మాయిలు తెగ ఫాలో అవుతున్నారు. కళ్ల కింద.. నాసికకి ఇరువైపులా.. మొటిమల్లా ఉండే చుక్కల్లాంటి చిన్నచిన్న టాటూలు వేయించుకుంటున్నారు. ‘ఫాక్స్‌ ఫ్రెకిల్స్‌’ విధానంతో మొహం, బుగ్గలు, చెక్కిళ్లు, మెడపై వేయించుకునే ఈ టాటూలు ఎనిమిది నెలల నుంచి రెండేళ్ల వరకు మాత్రమే ఉంటాయట.

ఇలా ఒక్కసారి పచ్చబొట్టు వేయించుకోవడానికి దాదాపు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు పెడుతున్నారు ముద్దుగుమ్మలు. కొందరైతే డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ అంటూ సొంతంగానే ప్రయోగాలు చేస్తున్నారు. సూదులు, పచ్చబొట్టు రంగులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి నచ్చినట్టుగా టాటూలు వేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ట్రెండ్‌ మోజులో పడి అందమైన మొహానికి చిల్లులు పెడుతూనే ఉన్నారు. ఎవరి స్టైల్‌ వారికి ఆనందం మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు