సొగసుగా.. సన్‌కిస్డ్‌ సెల్ఫీ

సెల్ఫీ అందంగా రావాలంటే అన్నింటికన్నా ముఖ్యమైంది కోణం. వీలైనంత సమయం తీసుకోండి. అటుఇటూ తిరగండి. కెమెరాను తిప్పండి.

Updated : 18 May 2024 02:11 IST

సెల్ఫీ.. వెల్ఫీ.. టూఫీ.. త్రీఫీ.. ఉస్సీ.. ఇలాంటి స్వీయచిత్రాల విచిత్ర ధోరణులు కుర్రకారుకి చాలానే తెలుసు. ఇప్పుడు తాజాగా సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా అంతా ‘సన్‌ కిస్డ్‌ సెల్ఫీ’ల జపం చేస్తున్నారు. అలియా భట్, కాజల్‌ అగర్వాల్, కియారా అడ్వాణీ, అనుష్క శర్మ సహా చాలా మంది నాయికలు సామాజిక మాధ్యమాల్ని ముంచెత్తిన ఫొటోలు ఈమధ్య వైరల్‌ అయ్యాయి. ఆ మెరుపు మేనకల్లాగే సూర్యుడిని ముద్దాడే సెల్ఫీలు అందంగా రావాలంటే ఇవిగోండి కిటుకులు.

కోణం: సెల్ఫీ అందంగా రావాలంటే అన్నింటికన్నా ముఖ్యమైంది కోణం. వీలైనంత సమయం తీసుకోండి. అటుఇటూ తిరగండి. కెమెరాను తిప్పండి. మీ పోజును మార్చండి. మొత్తానికి పర్‌ఫెక్ట్‌ యాంగిల్‌ వచ్చేవరకూ వదలొద్దు.
సూర్యకాంతి: సన్‌కిస్డ్‌ స్వీయచిత్రాలకు ముందు కావాల్సింది సూర్యకాంతి పడేచోటు. సూర్యుడు పూర్తిగా ఉదయించిన తర్వాత లేలేత ఎండ నుంచి పూర్తి ఎండ కాస్తున్నప్పుడు ఈ సెల్ఫీలకు మంచి సమయం. అప్పుడైతే బంగారు వర్ణంలో ఎండ నేరుగా ముఖంపై పడుతుంది. 

వెనుకవైపు: మంచి సెల్ఫీలు కావాలంటే కాస్తంత సైన్స్‌ని కూడా అమలు చేయాల్సిందే. సూర్యుడికి అభిముఖంగా కాకుండా.. ముందువైపు ఉండేలా నిల్చొని, తలని కాస్త పక్కకి తిప్పినప్పుడు లైటింగ్‌ సరిగ్గా ఉంటుంది. సూర్యకాంతి కళ్లలో పడకుండా.. కోరుకున్న విధంగా పోజు పెట్టొచ్చు.
ఫ్లాష్‌: ఈ సన్‌కిస్డ్‌ స్వీయచిత్రం మరింత బాగా రావాలంటే.. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఫ్లాష్‌ ఉపయోగించడం మరో కిటుకు. ఇలా చేసినప్పుడు ముఖంపై అదనపు కాంతి పడి.. ముఖం మరింత నిగారింపుగా కనిపిస్తుంది. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని