బజ్‌ కట్‌.. ఐబ్రో స్లిట్‌ కలిపి కొట్టు

అయితే ఆటతో.. లేదంటే స్టైల్‌తో సదా అభిమానులకు దగ్గరయ్యే సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లి. ఈసారి ఓ సరికొత్త స్టైల్‌తో అంతర్జాలంలో మంటలు రేపుతున్నాడు.

Published : 23 Mar 2024 00:27 IST

యితే ఆటతో.. లేదంటే స్టైల్‌తో సదా అభిమానులకు దగ్గరయ్యే సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లి. ఈసారి ఓ సరికొత్త స్టైల్‌తో అంతర్జాలంలో మంటలు రేపుతున్నాడు. అదే ఐబ్రో స్లిట్‌ స్టైల్‌. దాంతోపాటు ట్రిమ్డ్‌ గెడ్డం.. చెవికి పియర్సింగ్‌లతో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. కొన్నాళ్లుగా బెటర్‌హాఫ్‌ అనుష్కతో లండన్‌లో మకాం వేసిన కోహ్లి.. ఈ కొత్త రకం స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. అతగాడిని అలా తీర్చిదిద్దింది పాపులర్‌ సెలెబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలీం హకీం. 80, 90వ దశకంలో ఈ ట్రెండ్‌ కుర్రకారులో బాగా పాపులర్‌. హిప్‌హాప్‌ కళాకారులు ఎక్కువగా అనుసరించేవారు. తర్వాత క్రీడాకారులు.. అనంతరం సామాన్య కుర్రాళ్లదాకా చేరింది. కనుబొమ్మలపై కత్తెరతో నిలువు గీతలు పెట్టుకోవడం.. జుత్తులోని పక్కలకు నున్నగా క్రాఫ్‌ చేయడం ఈ స్టైల్‌ తీరు. దాంతోపాటు మరింత స్టైల్‌గా కనిపించాలనుకుంటే.. చెవులకు పియర్సింగ్‌ కూడా చేయించుకుంటారు. అప్పట్లో పాప్‌సింగర్‌ జయేన్‌ మాలిక్‌ ఈ ట్రెండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉండేవాడు. ఈ ఐబ్రో స్లిట్‌కి.. బజ్‌కట్‌ కాంబినేషన్‌ జోడించడం ఇప్పుడు కొత్తరకం ఫ్యాషన్‌గా చలామణిలోకి వచ్చింది. అన్నట్టు ఇది చూడటానికి బాగా స్టైలిష్‌గా ఉండటమే కాదు.. వేసవికి కూల్‌కూల్‌గా సౌకర్యంగానూ ఉంటుంది. అందుకే తారలు జై కొడుతున్నారు. వాళ్లని అనుసరించే కుర్రకారు మాత్రం ఊరుకుంటారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని