భారతీయ డిజైన్లు.. బియాన్స్‌ సోకులు

గౌరవ్‌ గుప్తా.. ఇండియాలో టాప్‌ డిజైనర్‌.. బియాన్స్‌ నోల్స్‌.. జగమెరిగిన అమెరికన్‌ పాప్‌ గాయకురాలు. ఈ ఇద్దరినీ ప్రఖ్యాత న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ కలిపింది.

Published : 17 Feb 2024 00:08 IST

సందర్భం

గౌరవ్‌ గుప్తా.. ఇండియాలో టాప్‌ డిజైనర్‌.. బియాన్స్‌ నోల్స్‌.. జగమెరిగిన అమెరికన్‌ పాప్‌ గాయకురాలు. ఈ ఇద్దరినీ ప్రఖ్యాత న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ కలిపింది. ఫ్యాషన్‌, సినిమా ప్రపంచంలో అదిప్పుడు సంచలన వార్తగా మారింది. గాయకురాలు, రచయిత్రి, వ్యాపారవేత్త అయిన బియాన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తమ డిజైన్లను ఆమె ధరించి, ఫ్యాషన్‌ షోలలో క్యాట్‌వ్యాక్‌ చేయడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌ డిజైనర్లు గొప్ప విజయంగా భావిస్తుంటారు. ఈసారి మన ఇండియన్‌ డిజైనర్‌ అలాంటి లక్కీఛాన్స్‌ దక్కించు కున్నాడు. అదీ ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్స్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భాగమైన.. లూయర్‌ ఫ్యాషన్‌ షోలో.. గౌరవ్‌ డిజైన్లు ధరించి ఎర్రతివాచీపై నడుస్తూ హొయలు పోయింది బియాన్స్‌. మెరుపుల వెండి రంగు బ్లేజర్‌, గెలాక్సీ క్రిస్టల్‌ జాకెట్‌, ఎంబ్రాయిడరీ బాడీసూట్‌, ఓవర్‌సైజ్డ్‌ సన్‌గ్లాసెస్‌, హోలోగ్రాఫిక్‌ లూయర్‌ బ్యాగ్‌, మోకాలిని తాకే లాంగ్‌ బూట్స్‌తో తను ర్యాంప్‌పై నడుస్తుంటే.. ఆ ప్రాంగణం కరతాళధ్వనులతో హోరెత్తిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని