కుర్రకారుకి.. మెస్సీ పాఠాలు!
ఫిఫా ప్రపంచకప్ ముగిసి వారమైనా లయోనల్ మెస్సీ నామస్మరణ ఆగడం లేదు. అతడ్ని ఆకాశానికెత్తేస్తోంది మీడియా. అభిమానులేమో సామాజిక మాధ్యమాల్లో నీరాజనాలు పడుతున్నారు. ఆటే కాదు.. తన వ్యక్తిత్వమూ అదుర్స్ అంటోంది ప్రపంచం... ఇంతకీ ఏంటట అతగాడి గొప్ప? తన నుంచి మనం ఏం నేర్చుకోగలం?
త్యాగాలకు సిద్ధం
కలలు నిజం కావాలంటే అలుపెరగకుండా శ్రమించాలి. త్యాగాలు చేయాలి. మెస్సీ జీవితం అందుకో ఉదాహరణ. తనకి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ఐదేళ్లకే సాధన మొదలు పెట్టి, పదేళ్లకి బంతితో మ్యాజిక్ చేసే స్థాయికి చేరాడు. ఈ సమయంలోనే ‘గ్రోత్ హార్మోన్ డెఫిషియెన్సీ’ బారిన పడటంతో అతడి కలలు కల్లలయ్యే పరిస్థితి వచ్చింది. ఈ లోపాన్ని సవరించుకునేందుకు రోజూ కాలికి ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. వీటికి నెలకి దాదాపు రూ.90 వేలు ఖర్చయ్యేవి. పేద కుటుంబానికి ఇది తలకు మించిన భారం. అయినా ఏనాడూ ఆటను ఆపేవాడు కాదు మెస్సీ. ఈ సమయంలోనే అతడి సామర్థ్యం, ఆటపై మమకారం గ్రహించి స్పెయిన్‌లోని ప్రఖ్యాత సాకర్ క్లబ్ ఎఫ్‌సీ బార్సిలోనా తమ క్లబ్ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆట కోసం పదమూడేళ్ల మెస్సీ పదకొండువేల కిలోమీటర్ల దూరం వెళ్లాడు. చదువూ ఆగిపోయింది. కనీసం కళాశాల మెట్లెక్కలేకపోయాడు.
లక్ష్యం చేరాలంటే నిత్యం పోరాడాల్సిందే. త్యాగాలు చేయాల్సిందే. మనల్ని మనం నిప్పుల కొలిమిలో మండించుకోవాల్సిందే.
విమర్శలకు వెరవొద్దు
స్టార్‌గా మారాక ఆరాధించేవాళ్లే కాదు.. అతడిపై రాళ్లు వేసేవాళ్లు, కిందికి లాగాలని చూసేవాళ్లూ ఉంటారు. మెస్సీ ఎత్తు 1.7 మీటర్లు. మామూలుగా ఇది మరీ తక్కువేం కాదు.. కానీ ఇతర ఫుట్‌బాల్ ఆటగాళ్లతో పోలిస్తే కురచే. ‘పొట్టివాడు’ అని అంతా హేళన చేసేవాళ్లు. ఆటతోనే వాళ్లకు సమాధానం చెప్పాలనుకున్నాడు. కసిగా మరింత సాధన చేసేవాడు. విమర్శించిన వాళ్లే మెచ్చుకునేలా ఎదిగాడు. తను ఎన్నో రికార్డులు సాధిస్తున్నా.. అర్జెంటీనా కీలకమైన అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓడిపోతుండటంతో దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా ‘తను రికార్డులకే పనికొస్తాడు తప్ప.. జట్టుని నడిపించే నాయకుడు కాదు’ అని ఘాటు విమర్శలు చేశాడు. దాన్ని సహృదయంతో స్వీకరించి తనని తాను మార్చుకున్నాడు మెస్సీ.
నాకు తెలిసింది ఆట ఒక్కటే. అదే నా వ్యాపకం,కెరియర్, ఇష్టం, ప్రాణం..
విజయం రాత్రికి రాత్రే దక్కదు
పదేళ్ల వయసులో దేశం తరపున ఆడాలని కలలు కన్నాడు. 2005లో తొలిసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అప్పట్నుంచి అతడి ప్రాతినిధ్యంలో అర్జెంటీనాకి ప్రపంచకప్ అందించాలనుకునేవాడు. 2009 నుంచి 2015 వరకు అతడికి స్వర్ణయుగమే. ప్రతి మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించాడు. దేశం తరపున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఎన్నో విజయాలు తన పాదాక్రాంతమైనా.. నాలుగు ప్రపంచకప్‌లలో ఆడినా.. తను కలలు కన్న సాకర్ వరల్డ్‌కప్ దేశానికి అందించడానికి మెస్సీ సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి వచ్చింది.
అర్జెంటీనాకి ప్రపంచకప్ అందించడం నా కల. ఈ స్వప్నం సాకారం కావడానికి నాకు 17 సంవత్సరాల 114రోజులు పట్టింది. విజయం ఒక్కరోజులో సాధ్యం కాదు.
కృతజ్ఞతలతో..
మెస్సీ అనారోగ్యం పాలైనప్పుడు తను ఆడుతున్న న్యూవెల్ ఓల్డ్‌బాయ్స్ క్లబ్ అతడికి సాయం చేయలేక చేతులెత్తేసింది. తర్వాత రివర్ ప్లేట్ క్లబ్ అతడి నైపుణ్యం గుర్తించి సొంతం చేసుకోవాలనుకుంది గానీ.. చికిత్స చేయించలేకపోయింది. ఆ సమయంలో ఎఫ్‌సీ బార్సిలోనా అతడితో ఒప్పందం కుదుర్చుకొంది. వైద్యం చేయించింది. దాన్ని మనసులో పెట్టుకున్నాడు మెస్సీ. ఇతర క్లబ్‌లు భారీ మొత్తం ఆశ చూపినా ‘నేను ఆడినంత కాలం ఎఫ్‌సీ బార్సిలోనా తరపునే ఉంటా’నని ప్రకటించాడు. జట్టుకి చిరస్మరణీయ విజయాలు అందించాడు. అలాగే తనకి మాతృభూమిపై మమకారం ఎక్కువ. ఎంత స్టార్ ఆటగాడైనా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తాడు. కోపా అమెరికా కప్‌లో చిలీ చేతిలో ఓటమి పాలైనప్పుడు.. ఓటమిని జీర్ణించుకోలేక బాధతో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కానీ ‘డోంట్ గో లియో’ అంటూ దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ నడవడంతో అభిమానుల కోసం మళ్లీ మైదానంలోకి దిగాడు. ప్రపంచకప్ అందించాడు.
నా రికార్డులు నన్నో గొప్ప ఆటగాడిని చేసి ఉండొచ్చు. కానీ నా ప్రతి విజయంలో దేశం, కోచ్, నేను ఆడే జట్టు, నా సహచర క్రీడాకారుల తోడ్పాటు ఉంటుంది. వాళ్లు లేకుండా నేను ఒక్క గోల్‌నైనా కొట్టలేను.
* మెస్సీ తండ్రి ఉక్కు పరిశ్రమలో కార్మికుడు. తల్లి ఇళ్లలో పని చేసేవారు.
* దేశంలో అతడికి ఎంత అభిమానం అంటే.. తమ పిల్లలకు మెస్సీ అనే పేరు పెట్టుకునేవారు. ... ఈ కన్ఫ్యూషన్‌ని తగ్గించడానికి ప్రభుత్వం ఏకంగా నిషేధం విధించింది.
* మెస్సీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే క్రీడాకారుడు. ఆట ద్వారా ఇప్పటివరకు ఆర్జించింది దాదాపు రూ.3000 కోట్లు.
* తను కనీసం కళాశాల విద్య సైతం పూర్తి చేయలేకపోయాడు. ఎఫ్‌సీ బార్సిలోనాతో ఒప్పందం చేసుకోవడంతో జీవితమంతా ఆటకే కేటాయించాల్సి వచ్చింది.
* ఈ ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు స్పానిష్ తప్ప మరో భాష మాట్లాడలేదు. ఆంగ్లం కొంచెం అర్థం చేసుకోగలడు అంతే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!
-
World News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Sports News
Surya - Samson: సూర్య కుమార్‌ను సంజూ శాంసన్‌తో పోల్చొద్దు... ఎందుకంటే: కపిల్ దేవ్
-
Movies News
Social Look: నెల తర్వాత నివేదా పోస్ట్.. కీర్తి సురేశ్ ‘వెన్నెల’ ఎఫెక్ట్!