Andhra News: రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవు: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌

రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. రోజుకు 204 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందన్నారు.

Published : 19 Feb 2022 18:23 IST

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. రోజుకు 204 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందన్నారు. జెన్‌కో, కృష్ణపట్నం పోర్టు, సౌర, పవన విద్యుత్‌ కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌ సరిపోక పోవడం వల్ల బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తు్న్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.7,700 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. 170 మిలియన్‌ యూనిట్ల వరకు లాంగ్‌ టర్మ్‌ కాంటాక్టులు ఉన్నాయని తెలిపారు. అధిక డిమాండ్‌ వేళల్లో మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. సాయంత్రం వేళ రూ.7 వరకు యూనిట్ ధర పెరుగుతోందన్నారు. అర్ధరాత్రి వేళ యూనిట్‌ ధర రూ.5లోపే ఉంటుందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధనశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని