జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధించాలి

ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 75% ఓటింగ్‌ నమోదయ్యేలా చూడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సూచించారు. అభివృద్ధి సుస్థిరంగా నిరంతరం కొనసాగడానికి వీలుగా జమిలి

Updated : 26 Jan 2022 04:50 IST

ఈసీకి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచన

ఈనాడు, దిల్లీ: ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 75% ఓటింగ్‌ నమోదయ్యేలా చూడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సూచించారు. అభివృద్ధి సుస్థిరంగా నిరంతరం కొనసాగడానికి వీలుగా జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధించాలన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం దిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఐసోలేషన్‌లో ఉన్న ఉప రాష్ట్రపతి పంపిన సందేశాన్ని, ఈ సందర్భంగా చదివి వినిపించారు. ‘‘సమాఖ్య వ్యవస్థలోని మూడంచెల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే మనం జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయానికి రావాలి. తొలి సార్వత్రిక ఎన్నికల్లో 44.87% ఓటింగ్‌ నమోదు కాగా, 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ఠంగా 67.40% పోలింగ్‌ జరిగింది. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ 75% ఉండేలా లక్ష్యం పెట్టుకోవాలి. దాన్ని చేరుకోవడం సాధ్యమే. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుణగణాల గురించి ప్రజలకు ఎక్కువ వివరాలు తెలిసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ఓటింగ్‌ ప్రక్రియ విశ్వసనీయతను పెంచడంతోపాటు, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి వినూత్న సాంకేతిక విధానాలను ఎన్నికల సంఘం అందిపుచ్చుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని