ఉద్యోగుల జీతాలు తగ్గడమేంటి?

‘పీఆర్‌సీ తరవాత ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గడమేమిటి? కొందరు ఉపాధ్యాయులైతే ప్రభుత్వానికే ఎదురు డబ్బు ఇవ్వాల్సి రావడం ఎంతవరకూ సమంజసం? కొత్త వేతనాలు అడగడంలేదు. మాకొచ్చే జీతమే మాకు ఇవ్వండి

Published : 26 Jan 2022 04:21 IST

మద్దతుగా చేపట్టిన నిరసన దీక్షలో భాజపా నేతలు

ఈనాడు, అమరావతి: ‘పీఆర్‌సీ తరవాత ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గడమేమిటి? కొందరు ఉపాధ్యాయులైతే ప్రభుత్వానికే ఎదురు డబ్బు ఇవ్వాల్సి రావడం ఎంతవరకూ సమంజసం? కొత్త వేతనాలు అడగడంలేదు. మాకొచ్చే జీతమే మాకు ఇవ్వండి అని పోరాటం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు ఏపీలోని ఉద్యోగులు మాత్రమే. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమే. ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు లేకుండానే ఉద్యోగ విరమణ వయసును రెండేళ్లు పెంచి అన్యాయం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాల్సిందే. ఉద్యోగులకు అండగా భాజపా ఉంటుంది’ అని భాజపా నేతలు ప్రకటించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ  ప్రభుత్వం చేతకానితనం వల్లే ఉద్యోగులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు? వారికి ఎన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని