Punjab Election 2022: పంజాబ్‌ బరిలో బామ్మగారి ‘లెహరా’యీ..

పంజాబ్‌ రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజీందర్‌ కౌర్‌ భట్టల్‌ 76 ఏళ్ల వయసులో లెహ్రా స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌) తరఫున ప్రత్యర్థిగా ఉన్న పర్మీందర్‌సింగ్‌

Published : 05 Feb 2022 08:39 IST

76 ఏళ్ల వయసులో మాజీ సీఎం పోరు

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజీందర్‌ కౌర్‌ భట్టల్‌ 76 ఏళ్ల వయసులో లెహ్రా స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌) తరఫున ప్రత్యర్థిగా ఉన్న పర్మీందర్‌సింగ్‌ ధిండ్సా కేవలం ప్రధాని నరేంద్రమోదీ ప్రతినిధి అని విమర్శలు ఎక్కు పెడుతున్నారు. 1992 నుంచి అన్నిసార్లూ శాసనసభ ఎన్నికల్లో నెగ్గుతూ వచ్చిన రాజీందర కౌర్‌ 2017లో మాత్రం ఓడిపోయారు. ధిండ్సా ఆమెపై నెగ్గారు. ఈసారి ఎన్నికల్లో నెగ్గి, ప్రతీకారం తీర్చుకోవాలని రాజీందర్‌ కౌర్‌ ఆరాటపడుతున్నారు. గత ఎన్నికల వరకు ఇక్కడ పోటీ కాంగ్రెస్‌, అకాలీదళ్‌ మధ్య ద్విముఖంగా ఉండేది. ఈసారి ఆప్‌ కూడా బరిలోకి దిగింది. 1996-97లో మూడు నెలలపాటు సీఎంగా వ్యవహరించే అవకాశం రాజీందర్‌ కౌర్‌కు దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని