AP News: ఇంటి నిర్మాణానికి ఇల్లాలి యాచన

‘బేస్‌మెంట్‌ నిర్మించకపోతే స్థలం రద్దవుతుంది’ అన్న అధికారులు హెచ్చరికలకు ఆవేదన చెందిన ఓ ఇల్లాలు.. ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి డబ్బుల కోసం యాచనకు

Published : 04 Jul 2021 08:29 IST

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ‘బేస్‌మెంట్‌ నిర్మించకపోతే స్థలం రద్దవుతుంది’ అన్న అధికారులు హెచ్చరికలకు ఆవేదన చెందిన ఓ ఇల్లాలు.. ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి డబ్బుల కోసం యాచనకు ఉపక్రమించింది. ఈ దుస్థితి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సుబ్బరత్తాలు అనే మహిళకు తలెత్తింది. వివరాలు ఇలా ఉన్నాయి. యర్రగొండపాలేనికి చెందిన నేరేళ్ల సుబ్బరత్తాలు భర్త అయిదేళ్ల క్రితం చనిపోయారు. పెద్ద కుమారుడు బ్రహ్మం (15) అమాయకంగా ఉండటం, రెండో కొడుకు శివచంద్రశేఖర్‌(10) చిన్నవాడు కావడంతో వారిని పోషించేందుకు స్థానిక హోటల్లో పనిచేస్తోంది. వీరికి జగనన్న కాలనీలో ఇంటిస్థలం మంజూరైంది. అయితే రెండురోజుల క్రితం అధికారులు వచ్చి వెంటనే బేస్‌మెంట్‌ వేయకపోతే స్థలం రద్దుచేస్తామని చెప్పడంతో ఆందోళనకు గురైంది. దిక్కుతోచని స్థితిలో డబ్బు కోసం యర్రగొండపాలెం ప్రధాన కూడలిలో రెండు రోజులుగా దుకాణాలు, ప్రజల వద్దకు తిరుగుతూ సాయం చేయాలని కోరుతోంది. ఆమె దీనస్థితిని తెలుసుకొని దాతలు తోచిన ఆర్థికసాయం చేస్తున్నారు. ఇది కేవలం తన ఒక్కరి దుస్థితే కాదని, తనలా అనేకమంది డబ్బులు లేక స్థలాలు వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని