టోకు వ్యాపారంలోకి ఆప్కో

జాతీయ స్థాయిలో టోకు వ్యాపారాన్ని అందిపుచ్చుకునేలా ఆప్కో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం శుభపరిణామమని చేనేత, జౌళిశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కో

Published : 20 Jan 2022 05:21 IST

చేనేత వస్త్రాల జాబితాను ఆవిష్కరించిన మంత్రి గౌతమ్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జాతీయ స్థాయిలో టోకు వ్యాపారాన్ని అందిపుచ్చుకునేలా ఆప్కో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం శుభపరిణామమని చేనేత, జౌళిశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కో వస్త్ర శ్రేణికి సంబంధించిన జాబితా ప్రతులను ఆయన బుధవారం ఆవిష్కరించారు. హోల్‌సేల్‌ విధానంతో చేనేత వస్త్రాల మార్కెటింగ్‌ను ప్రోత్సహించగలిగితే చేనేత కార్మికులకు పూర్తిస్థాయిలో పని లభిస్తుందని మంత్రి అన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో ఆప్కో మెగా షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ నాగరాణి వెల్లడించారు. ఛైర్మన్‌ మోహన్‌రావు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని