మహిళా రైతుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు

హరియాణాలో దారుణం జరిగింది. సాగు చట్టాల వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పాల్గొని సొంత ఊరికి బయలుదేరిన మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 29 Oct 2021 06:23 IST

టిక్రీలో ప్రమాదానికి కారణమైన ట్రక్కు

బహదుర్‌గఢ్‌: హరియాణాలో దారుణం జరిగింది. సాగు చట్టాల వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పాల్గొని సొంత ఊరికి బయలుదేరిన మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం  తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని మన్సా జిల్లా ఖీవా ద్యాలువాలా గ్రామానికి చెందిన మహిళలు టిక్రీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం స్వగ్రామానికి బయలుదేరారు. బహదుర్‌గఢ్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు రహదారిపై ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఓ ట్రక్కు వీరి పైకి వేగంగా దూసుకురావడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్‌ పారిపోయాడని, వాహనాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌పీ వసీమ్‌ అక్రమ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని