ప్రభుత్వ ఒప్పందాలపై నిందలా?
వాన్‌పిక్ వ్యవహారంలో ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సీబీఐ ఎలా తప్పుపడుతుందని నిమ్మగడ్డ ప్రసాద్ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు.
వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ తరఫు వాదనలు
ఈనాడు, హైదరాబాద్: వాన్‌పిక్ వ్యవహారంలో ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సీబీఐ ఎలా తప్పుపడుతుందని నిమ్మగడ్డ ప్రసాద్ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఒప్పందాలపై గవర్నరు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించారని, సందేహాస్పదంగా ఉందంటూ సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొనడం సరికాదన్నారు. వాన్‌పిక్ పారిశ్రామికవాడ ప్రాజెక్టుకు అవసరమైన భూముల కొనుగోలుకు రూ.300 కోట్లు వెచ్చించామని, తమ సొమ్ము ఖర్చు పెట్టడాన్ని సీబీఐ తప్పుబడుతోందన్నారు. ప్రాజెక్టుపై అటు రస్ అల్ ఖైమా (రాక్) ఇటు ప్రభుత్వం తమపై ఎలాంటి ఫిర్యాదూ చేయలేదన్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ వాన్‌పిక్ ప్రాజెక్టుతోపాటు నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు ఇప్పటికీ అమల్లోనే ఉందని, ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాము సమర్పించిన రూ.5 కోట్ల బ్యాంకు గ్యారంటీలను వచ్చే ఏడాది డిసెంబరు వరకు పొడిగించామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలను మంత్రి మండలితోపాటు ముఖ్యమంత్రి పరిశీలించారని, ఇందులో ఎక్కడా తప్పుదోవపట్టించి ఒప్పందాలను కుదుర్చుకోలేదన్నారు. రైతులకు చెల్లించిన సొమ్ములో మోసం చేశామని సీబీఐ చెబుతోందని, రైతులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రూ.20 లక్షలు ఇచ్చామని చెప్పగా, ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తమ రికార్డుల్లో ఉన్నట్లే రూ.27.64 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించినదానికంటే ఎక్కువగా చెల్లించామని, గుడ్‌విల్ కింద చెల్లించిన మొత్తాలపై రాక్‌ను మోసం చేసినట్లు చెప్పారన్నారు. రాక్ ఆదేశాల మేరకు ఇతర జిల్లాల్లో భూములను కొనుగోలు చేయడం నేరమని సీబీఐ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీబీఐ తనకు అనుకూలంగా ఉన్న పత్రాలనే సమర్పించిందని, ఇతర పత్రాలను తొక్కిపెట్టిందన్నారు. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్‌కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్‌ఫోన్‌కి వస్తున్న మెసేజ్‌లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్‌పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్‌లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్‌లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్‌లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్‌లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు