మాజీ మంత్రి నారాయణకు ఊరట

రాజధాని అమరావతి డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ, తదితరుల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. విచారణను

Updated : 27 May 2022 06:05 IST

రాజధాని డిజైనింగ్‌, రింగ్‌రోడ్డు కేసులో తొందరపాటు చర్యలొద్దంటూ సీఐడీకి హైకోర్టు ఆదేశం

విచారణ జూన్‌ 9కి వాయిదా

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ, తదితరుల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. విచారణను జూన్‌ 9కి వాయిదా వేస్తూ గురువారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కె.పి.వి.అంజనీ కుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, ఆయన సోదరుడు లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. గురువారం జరిగిన విచారణలో సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో అదనపు ఏజీ వాదనలు వినిపిస్తారని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని, వచ్చేవరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లను అరెస్టు చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. హైకోర్టు స్పందిస్తూ జూన్‌ 9వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని