మీటర్లు ఏర్పాటు చేసినా రైతులపై పైసా భారం ఉండదు

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు నగదు బదిలీ పథకం (డీబీటీ) కింద విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసినా రైతులపై ఒక్క పైసా భారం పడదని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published : 08 Aug 2022 05:12 IST

మంత్రి పెద్దిరెడ్డి

ఈనాడు, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు నగదు బదిలీ పథకం (డీబీటీ) కింద విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసినా రైతులపై ఒక్క పైసా భారం పడదని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మీటర్ల ఏర్పాటుతో రైతులు వినియోగించే విద్యుత్‌ లెక్కల్లో స్పష్టత వస్తుందన్నారు. డీబీటీ, వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ అందించే పథకంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నగదు బదిలీ పథకం కోసం ప్రభుత్వమే రైతుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తుంది. దీనికి అనుగుణంగా 97 శాతం మంది రైతులు అంగీకార పత్రాలను డిస్కంలకు అందించారు. మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో ఉండే అపోహలను తొలగించడానికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని