Ayurvedic medicine: ఆయుర్వేద వైద్యంపై 211 గ్రామాల్లో ప్రచారం

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద రాష్ట్రంలోని 211 గ్రామాల్లో ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వచ్చే

Updated : 09 Aug 2022 06:43 IST

ఈనాడు, అమరావతి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద రాష్ట్రంలోని 211 గ్రామాల్లో ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు మురికివాడలు, పాఠశాలల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములు తెలిపారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యం ప్రాధాన్యం తెలియజేస్తూ.. జీవనశైలి విధానంలో వచ్చిన మార్పులవల్ల తలెత్తుతోన్న అనారోగ్య సమస్యలు, పరిష్కారం గురించి శిబిరాల ద్వారా వివరిస్తారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలోని 13 పూర్వ జిల్లాల ప్రతిపాదికన 13 పంచకర్మ ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ఆయుష్‌ శాఖ ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలో కొలవెన్ను, నెల్లూరు జిల్లాలో అల్లూరు, గుంటూరు జిల్లా అమరావతి, ఇతర చోట్ల ఈ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. శరీరంలోని దోషాలను బయటకు పంపించి సాంత్వన చేకూర్చే ఈ పంచకర్మ వైద్యానికి తగిన గుర్తింపు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని