సర్కారు వైద్యులకు అలవెన్సుల నిలుపుదల

సర్కారు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వైద్యులకు వారి అర్హతలను అనుసరించి నెలకి రూ.5,800 వరకు కోత పెట్టేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ హెల్త్‌ కేర్‌, రూరల్‌, ట్రైబల్‌, పీజీ

Published : 23 Sep 2022 05:19 IST

పీఆర్సీ ఉత్తర్వుల్లో వివరాలు లేవని మెలిక

ఈనాడు, అమరావతి: సర్కారు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వైద్యులకు వారి అర్హతలను అనుసరించి నెలకి రూ.5,800 వరకు కోత పెట్టేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ హెల్త్‌ కేర్‌, రూరల్‌, ట్రైబల్‌, పీజీ అకడమిక్‌ అలవెన్సుల రూపంలో చెల్లించే మొత్తాన్ని ఇకపై ఇవ్వలేమని గణాంకశాఖ అధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపారు. 11వ పీఆర్సీకి సంబంధించిన జీఓ 101 (11.05.2022)లో అలవెన్సుల చెల్లింపుల గురించి వివరాలు లేవన్న కారణంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. పదో పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం 2008లో జారీ చేసిన జీఓ 387ని అనుసరించి వైద్యులకు అలవెన్సులు చెల్లిస్తున్నారు. ఎమర్జెన్సీ అలవెన్సు కింద రూ.3,000, పీజీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న వారికి రూ.1,500, డిప్లొమా వారికి రూ.1,000, పీజీ కింద, అకడమిక్‌ అలవెన్సు కింద రూ.300 వైద్యులకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ అలవెన్సు కింద నెలకు రూ.3,000 ఎంబీబీఎస్‌ వైద్యులకు కూడా అందుతోంది. 11వ పీఆర్సీ అమల్లోకి వచ్చిన తరవాతా చెల్లిస్తున్నారు. ‘పాత పీఆర్సీ ఉత్తర్వుల్లో అలవెన్సుల గురించి పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ జీఓలో పేర్కొనలేదు. మాకు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీఓలే ప్రామాణికం. అందువల్ల అలవెన్సులు చెల్లించలేం’ అని అధికారులు  చెబుతున్నారని వైద్యులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని