దేవరాపల్లి-కొత్తవలస రోడ్డులో కూరుకుపోయిన లారీలు

అనకాపల్లి జిల్లా ఆనందపురం-దేవరాపల్లి రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఆదివారం ఉదయం 6.30 గంటలకు గోతుల్లో కూరుకుపోయాయి. దీంతో దేవరాపల్లి నుంచి కొత్తవలస మధ్య గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి.

Published : 26 Sep 2022 04:38 IST

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఆనందపురం-దేవరాపల్లి రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఆదివారం ఉదయం 6.30 గంటలకు గోతుల్లో కూరుకుపోయాయి. దీంతో దేవరాపల్లి నుంచి కొత్తవలస మధ్య గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, భవనాల శాఖ అధికారులు క్రేన్‌ సాయంతో 11 గంటల సమయంలో రెండు లారీలను బయటకు తీసి, రాకపోకలు పునరుద్ధరించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న మాడుగుల నియోజకవర్గంతోపాటు ఆయన సొంత మండలమైన దేవరాపల్లిలోనే రోడ్డు దారుణంగా తయారైంది. ఈ రోడ్డు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని