ఘంటసాలకు ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారం

‘నాన్నకు ఎన్టీఆర్‌ చలనచిత్ర శతాబ్ది పురస్కారం ప్రకటించడం ఆనందంగా ఉంది’ అని మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు కుమారుడు శంకర్‌ పేర్కొన్నారు. వేంకటేశ్వరరావు తరఫున ఆయన కుమారుడు శంకర్‌ ఈ పురస్కారాన్ని

Published : 26 Sep 2022 04:38 IST

అందుకున్న ఆయన కుమారుడు శంకర్‌

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: ‘నాన్నకు ఎన్టీఆర్‌ చలనచిత్ర శతాబ్ది పురస్కారం ప్రకటించడం ఆనందంగా ఉంది’ అని మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు కుమారుడు శంకర్‌ పేర్కొన్నారు. వేంకటేశ్వరరావు తరఫున ఆయన కుమారుడు శంకర్‌ ఈ పురస్కారాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం అందుకున్నారు. సభకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెదేపా అధికారంలోకి రాగానే ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేసి, తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెడతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడంవల్లే ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వలేదని, అదే బాలీవుడ్‌లో పుట్టి ఉంటే అనేక పురస్కారాలు లభించేవని తెలిపారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయంటే అది ఆయన ఘనతేనని సినీనటుడు బాబూమోహన్‌ పేర్కొన్నారు. పురస్కార ప్రదాత, ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈ శతాబ్ది మహోత్సవం ముగిసేలోగా కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని కోరారు. అనంతరం ఆయన ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఘంటసాల వేంకటేశ్వరరావు కుమారుడు శంకర్‌కు ప్రదానం చేశారు. మహిళా కమిషన్‌ పూర్వ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌, ఆత్మీయ అతిథి ఎన్‌.టి.ఆర్‌.రాజు, సినీ రచయిత మహ్మద్‌ సాబీర్‌షా తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని