హంస వాహనంపై శ్రీమలయప్పస్వామి తేజసం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు బుధవారం రాత్రి శ్రీమలయప్పస్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు ఐదు పడగల చిన్నశేష వాహనంపై బదరీ నారాయణ అలంకారంలో కనువిందు చేశారు.

Updated : 29 Sep 2022 03:53 IST

ఈనాడు, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు బుధవారం రాత్రి శ్రీమలయప్పస్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు ఐదు పడగల చిన్నశేష వాహనంపై బదరీ నారాయణ అలంకారంలో కనువిందు చేశారు.

శ్రీవారికి విదేశీ పండ్లు: ఈసారి బ్రహ్మోత్సవాల్లో స్నపన తిరుమంజనం కోసం తితిదే అధికారులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని భక్తుల నుంచి పూలు, పండ్లు సేకరించారు. బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంనిర్వహించారు. ఇందుకోసం జపాన్‌ నుంచి యాపిల్స్‌, మస్కట్‌ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్‌, థాయ్‌లాండ్‌ నుంచి మామిడి, అమెరికా నుంచి చెర్రీలు సేకరించారు. అలాగే తొలిసారిగా రాగులతో చేసిన మాలలు, స్నపన తిరుమంజనంలో యాలకులు, వట్టివేర్లు, ద్రాక్ష, తులసి దండలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అలంకరణకు టన్ను కట్‌ ఫ్లవర్స్‌, పండ్లు తెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని