పాలిటెక్నిక్‌ లెక్చరర్ల శిక్షణ కేంద్రం మూసివేతకు ప్రయత్నాలు

పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్లకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటుచేసిన జాతీయ సాంకేతిక టీచర్ల శిక్షణ, పరిశోధన సంస్థ ఏపీ శాఖను మూసివేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Published : 07 Oct 2022 04:47 IST

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్లకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటుచేసిన జాతీయ సాంకేతిక టీచర్ల శిక్షణ, పరిశోధన సంస్థ ఏపీ శాఖను మూసివేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నై ప్రాంతీయ కేంద్రానికి అనుబంధంగా రాష్ట్రంలో విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీనిద్వారా ఏటా రూ.కోటి ఖర్చుతో లెక్చరర్లకు శిక్షణ ఇస్తారు. దీన్ని 2015లో సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఇటీవల సాంకేతిక విద్యాశాఖ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరికి తరలించారు. అక్కడ తమకు సదుపాయాలు లేవని, అడిగినా కల్పించడం లేదని శిక్షణ సంస్థ ప్రొఫెసర్‌ ఆరోపిస్తున్నారు. దీంతో విస్తరణ కేంద్రాన్ని మూసేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కేంద్రాన్ని చెన్నై ప్రాంతీయ కేంద్రంలోనే విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని