Vizag: ‘చోళ సూట్‌’.. అనుమతి లేని వ్యక్తులు చేరుకోవడం అసాధ్యం

‘చోళ సూట్‌’... ఇది అతిథి గృహం పేరు. భద్రతాపరంగా అత్యంత సురక్షితమైన కేంద్రంగా పేరుగాంచింది. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ 11వ తేదీ రాత్రి అందులోనే బస చేయనున్నారు.

Published : 11 Nov 2022 08:04 IST

విశాఖ: ‘చోళ సూట్‌’... ఇది విశాఖపట్నంలోని అతిథి గృహం పేరు. నగర పర్యటనకు రానున్న ప్రధాని మోదీ.. శుక్రవారం రాత్రి దీనిలోనే బస చేయనున్నారు. భద్రతాపరంగా అత్యంత సురక్షితమైన కేంద్రంగా ఇది పేరుగాంచింది. తూర్పు నౌకా దళం పర్యవేక్షణలో ఉన్న విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ సర్కార్స్‌లోనే ‘చోళ సూట్‌’ ఉంది. నిత్యం నిఘా నీడలో ఉండే ఈ రక్షణ నిలయానికి అనుమతి లేని వ్యక్తులు చేరుకోవడం అసాధ్యం. దేశ రాష్ట్రపతులు, ప్రధానులే ఇక్కడ బస చేస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని