ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు ఉషారాణికి స్త్రీ అవార్డు

ప్రకృతి వ్యవసాయ సాగులో గుంటూరుకు చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించారు.

Published : 28 Nov 2022 04:50 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రకృతి వ్యవసాయ సాగులో గుంటూరుకు చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు దిల్లీలో జాతీయ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయుష్‌ సంయుక్త కార్యదర్శి ప్రమోద్‌ కుమార్‌ చేతుల మీదుగా ఆమె స్త్రీ (శాస్త్ర, సాంకేతిక పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకం) అవార్డును అందుకున్నారని రైతు సాధికార సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సదస్సుకు ఉషారాణి, అనంతపురం జిల్లాకు చెందిన వనూరమ్మ పేర్లను రైతు సాధికార సంస్థ ప్రతిపాదించింది. వీరిద్దరూ ప్రకృతి వ్యవసాయం చేయడంవల్ల రసాయన రహిత ఆహారాన్ని సమాజానికి అందించడంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చనే అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని