కోతి రంగు నలుపు!

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చినదొడ్డిగుంటలో నల్ల కోతిపిల్ల అందరి దృష్టిని ఆకర్షించింది.

Published : 01 Dec 2022 04:29 IST

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చినదొడ్డిగుంటలో నల్ల కోతిపిల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. చెట్టుపై సాధారణ కోతిపిల్లతో కలిసి నల్లకోతి గంతులు వేస్తూ కనిపించింది. దాని మెడలో తాడు ఉంది. దీనిపై రంగంపేట పశు సంవర్ధకశాఖ అధికారి షేక్‌ జహంగీర్‌ స్పందిస్తూ.. జన్యుపరమైన లోపాలతో పుట్టిన పిల్లల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, ఈ కోతిపిల్లకు రంగులో మార్పు వచ్చిందని తెలిపారు. 

న్యూస్‌టుడే, రంగంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని