ఆశాదీపంగా పసుపు రంగు మిర్చి

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొందరు రైతులు ఈ ఏడాది మిరప పంటలో కొత్త రకాన్ని సాగుచేస్తున్నారు.

Published : 30 Jan 2023 03:38 IST

ఈనాడు, అమరావతి: గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొందరు రైతులు ఈ ఏడాది మిరప పంటలో కొత్త రకాన్ని సాగుచేస్తున్నారు. ఎర్రమిర్చికి నల్లతామర పురుగు ముప్పుగా మారిన నేపథ్యంలో ఆ తెగులు ప్రభావం పెద్దగా లేని పసుపు రంగు రకాన్ని ఎంచుకున్నారు. సాధారణ మిర్చితో పోల్చితే పసుపు రంగు కాయలకు అధిక ధర పలుకుతోంది. దీన్ని ఔషధాల తయారీ, అప్పడాలు వంటి ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నారు. గతేడాది సరకు లభ్యత తక్కువగా ఉండటంతో క్వింటాలు రూ.50 వేలు పలికింది. గురజాల ప్రాంతంలో రైతులు ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు పండించి లాభాలు పొందారు. అధిక వర్షాలు, ప్రతికూల పరిస్థితుల్లో కొంత దిగుబడులు తగ్గినా ఎకరాకు 10-15 క్వింటాళ్ల వరకు రావచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఎర్రమిర్చితో పోల్చుకుంటే పురుగుమందుల రూపంలో ఎకరాకు రూ.30వేలకుపైగా ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాలు రూ.30వేల ధర పలుకుతోంది. వచ్చే ఏడాది ఈ రకం సాగు విస్తరించవచ్చని గుంటూరు జిల్లా ఉద్యాకారి సుజాత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని