ఏడు ఎత్తైన శిఖరాల అధిరోహణ

విశాఖ నగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ (30) ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారత పతాకాన్ని ఎగుర వేశారు.

Published : 30 Jan 2023 04:50 IST

భూపతిరాజు అన్మిష్‌ వర్మ అరుదైన ఘనత

విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్‌టుడే: విశాఖ నగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ (30) ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారత పతాకాన్ని ఎగుర వేశారు. మధురవాడ సమీప పీఎంపాలెం ప్రాంతానికి చెందిన ఆయన 2020లో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలన్న తపన అతనిలో ఉండేది. ఈ క్రమంలో ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాల అధిరోహణ (సెవెన్త్‌ సమ్మిట్‌ ఛాలెంజ్‌)పై దృష్టి సారించారు. 2020లో తన ప్రస్థానం ప్రారంభించి ఆసియా (ఎవరెస్టు), దక్షిణ అమెరికా (మౌంట్‌ అకాంగువా), ఆఫ్రికా (కిలిమంజారో), యూరప్‌ (ఎల్‌బ్రస్‌), ఉత్తర అమెరికా (డెనాలి), ఆస్ట్రేలియా (మౌంట్‌ కొస్కిస్కో), చివరిగా ఈ నెల 22న అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ను అధిరోహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భూపతిరాజు అన్మిష్‌ వర్మ ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున 75 కిలోల లోపు విభాగంలో గతంలో 6 సార్లు పాల్గొన్నారు. ఒకసారి వెండి, రెండు సార్లు బంగారు పతకాలు సాధించారు. సెవెన్త్‌ సమ్మిట్‌ ఛాలెంజ్‌ లక్ష్యాన్ని మూడేళ్లలో పూర్తి చేసినట్లు అన్మిష్‌ వర్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని