కృష్ణపట్నం నడవాకు రూ.533.86 కోట్లు విడుదల
చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.533.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ తెలిపారు.
కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్
ఈనాడు, దిల్లీ: చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.533.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ తెలిపారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణపట్నం నడవాకు సంబంధించి 12,798 ఎకరాలకు సమగ్ర బృహత్తర ప్రణాళిక, ప్రాథమిక ఆకృతి ఇప్పటికే పూర్తయ్యాయని, అందులో 2,500 ఎకరాలను మొదటి దశకు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన 2,139 ఎకరాలకు పర్యావరణ అనుమతులు పొందినట్లు వెల్లడించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 474 పాఠశాలలకుగాను 372 బడుల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* దేశవ్యాప్తంగా 2022, మార్చి నాటికి 38,901 గ్రామాలకు మొబైల్ సేవలు అందడం లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలకు మొబైల్ సేవలు అందడం లేదని మంత్రి పేర్కొన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చిత్తూరు, రాజంపేట ఎంపీలు ఎన్.రెడ్డప్ప, పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇవ్వాలని సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీ సంక్షేమ సంఘం 2021లోనే దరఖాస్తు చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇది పాక్షిక న్యాయ ప్రక్రియతో కూడిన అంశమని, 1999 నాటి జీఐ చట్టం నియమ నిబంధనలతో ముడిపడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC:పేపర్ లీకేజీ.. నలుగురు నిందితులకు కస్టడీ
-
India News
Rahul Gandhi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన... పలుచోట్ల ఉద్రిక్తత
-
Movies News
Manchu Manoj: ట్విటర్ వేదికగా మంచు మనోజ్ ట్వీట్స్.. విష్ణును ఉద్దేశించేనా?
-
Sports News
World Boxing Championship: మహిళల బాక్సింగ్ ప్రపంచకప్‌లో నీతూకు స్వర్ణం
-
Politics News
KTR: తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతోంది: కేటీఆర్
-
India News
BJP: ‘అదానీతో సంబంధం లేదు.. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే..!’