మాది గ్రామ స్వరాజ్య బడ్జెట్‌: జగన్‌

సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించిన సమయానికి.. కాస్త అటూ ఇటుగా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పడానికి గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 25 Mar 2023 11:59 IST

ఈనాడు, అమరావతి: సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించిన సమయానికి.. కాస్త అటూ ఇటుగా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పడానికి గర్వంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి తమ ప్రభుత్వం గ్రామ స్వరాజ్య బడ్జెట్‌ను తెచ్చిందన్నారు. ఇది అక్కచెల్లెళ్లు, రైతుల పక్షపాత బడ్జెట్‌ అని, సామాజిక న్యాయ బడ్జెట్‌ అని చెప్పారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం.. 2023-24 సంవత్సరంలో వివిధ పథకాల అమలుకు సంబంధించిన సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వివరాలివీ..

ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన, వైఎస్‌ఆర్‌ ఆసరా, ఈబీసీ నేస్తం (గతంలో ఇవ్వాల్సినవి)

మే నెలలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన, కల్యాణమస్తు, మత్స్యకార భరోసా

జూన్‌లో జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, లా నేస్తం, అర్హులకు పథకాల అమలు

జులైలో జగనన్న విదేశీ విద్యాదీవెన, నేతన్న నేస్తం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహకాలు, జగనన్న తోడు, పొదుపుసంఘాలకు సున్నా వడ్డీ, కల్యాణమస్తు/షాదీ తోఫా

ఆగస్టులో జగనన్న విద్యాదీవెన, కాపునేస్తం, వాహనమిత్ర

సెప్టెంబరులో వైఎస్‌ఆర్‌ చేయూత

అక్టోబరులో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, జగనన్న వసతి దీవెన

నవంబరులో పంటరుణాలకు సున్నా వడ్డీ, కల్యాణమస్తు/షాదీ తోఫా, విద్యాదీవెన

డిసెంబరులో జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న చేదోడు, అర్హులకు పథకాల అమలు

2024 జనవరిలో వైఎస్‌ఆర్‌ రైతుభరోసా- పీఎం కిసాన్‌, వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న తోడు, లా నేస్తం, పింఛన్‌ రూ.3 వేలకు పెంపు

2024 ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, కల్యాణమస్తు/షాదీ తోఫా, ఈబీసీ నేస్తం

2024 మార్చిలో జగనన్న వసతి దీవెన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాల విడుదల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని