Tirupati: తిరుపతి గంగమ్మ ఆలయంలో ‘జె గన్‌’ తోరణం.. విపక్షాల మండిపాటు

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన పూల అలంకారం వివాదాస్పదమైంది. జాతర సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ ప్రధానద్వారం వద్ద తోరణాన్ని ఏర్పాటుచేశారు.

Updated : 17 May 2023 07:11 IST

ఈనాడు, అమరావతి, తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన పూల అలంకారం వివాదాస్పదమైంది. జాతర సందర్భంగా సోమవారం రాత్రి ఆలయ ప్రధానద్వారం వద్ద తోరణాన్ని ఏర్పాటుచేశారు. ముఖద్వారం వైపు వైకాపా జెండా రంగులు పోలిన పూలమధ్యలో జె అనే ఆంగ్ల అక్షరం, గన్‌ (తుపాకీ) బొమ్మ మాదిరి డిజైన్‌ పెట్టారు. దీనిపై వివిధ పార్టీల నాయకులు మండిపడ్డారు.

దైవసన్నిధిలో ఈ సంస్కృతి ఏమిటని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? వైకాపా జెండా గుర్తులేమిటి? ‘జె’ అక్షరానికి, గంగమ్మకు సంబంధం ఉందా?’ అని ట్విటర్‌ వేదికగా చంద్రబాబు నిలదీశారు. ‘ఆలయ ఆవరణలో జె అక్షరంతోపాటు గన్‌ బొమ్మ వచ్చేలా పూలతో అలంకరించడం చూస్తే జగన్‌ గ్యాంగ్‌లు ఎంతగా బరి తెగించాయో తేటతెల్లమవుతుంది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

* గంగమ్మ తల్లి ఆలయం వద్ద గంగ జాతర రోజు వైకాపా నాయకులు జగన్‌ అని అర్థం వచ్చేలా ‘జె గన్‌’ రూపంలో పూలతో అలంకరించడం ఎంతవరకు సమంజసమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని