UPSC: సివిల్స్‌ మెయిన్‌కు 600 మంది తెలుగు అభ్యర్థులు

సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రాథమిక పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ సోమవారం విడుదల చేసింది. గత నెల 28వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది వరకు హాజరయ్యారు.

Updated : 13 Jun 2023 07:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రాథమిక పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ సోమవారం విడుదల చేసింది. గత నెల 28వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది వరకు హాజరయ్యారు. కటాఫ్‌ మార్కుల ఆధారంగా వారిలో 14,624 మంది మెయిన్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అందులో 600 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,128 మంది దరఖాస్తు చేయగా వారిలో సుమారు 45వేల మంది పరీక్ష రాశారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 200లకు కటాఫ్‌ మార్కులు 80 వరకు ఉండొచ్చని బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు. యూపీఎస్‌సీ మాత్రం కటాఫ్‌ మార్కులను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. వచ్చే సెప్టెంబరు 15 నుంచి అయిదు రోజులపాటు మెయిన్స్‌ జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని