హైస్కూల్‌ ప్లస్‌లో ప్రవేశాలు ఢమాల్‌

హైస్కూల్‌ ప్లస్‌లో ప్రారంభించిన ఇంటర్మీడియట్‌కు ఈ ఏడాదీ విద్యార్థుల నుంచి స్పందన కరవైంది. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం 253 హైస్కూళ్లలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభిస్తే ప్రథమ సంవత్సరంలో కేవలం 3,319 మంది మాత్రమే చేరారు.

Published : 27 Jun 2023 06:45 IST

253 హైస్కూళ్లల్లో 13 శాతమే
మొదటి ఏడాదిలో 3,319 చేరిక

ఈనాడు, అమరావతి: హైస్కూల్‌ ప్లస్‌లో ప్రారంభించిన ఇంటర్మీడియట్‌కు ఈ ఏడాదీ విద్యార్థుల నుంచి స్పందన కరవైంది. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం 253 హైస్కూళ్లలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభిస్తే ప్రథమ సంవత్సరంలో కేవలం 3,319 మంది మాత్రమే చేరారు. ఈ లెక్కన ఒక్కో దాంట్లో సరాసరిన 13.12 శాతం మంది చొప్పున చేరారు. ద్వితీయ సంవత్సరంలో 2,901 మంది ఉన్నారు. రెండు సంవత్సరాల్లో కలిపి విద్యార్థుల సంఖ్య 6,220కి చేరింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లో గతేడాది 12% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 63 చోట్ల సున్నా ఫలితాలు వచ్చాయి. పాఠాలు చెప్పేందేకు గతేడాది అధ్యాపకులనూ నియమించలేదు. ఈ ఏడాది అధ్యాపకులను నియమించినా గతేడాది ఫలితాల దృష్ట్యా ప్రవేశాలకు విద్యార్థినులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రవేశాలను పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు పదో తరగతి వారికి టీసీలు ఇచ్చేందుకు నిరాకరించారు. హైస్కూల్‌ ప్లస్‌లోనే చేరాలంటూ ఒత్తిడి చేశారు. కానీ, ప్రవేశాలు మాత్రం పెరగలేదు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 30 హైస్కూళ్లలో 484మంది చేరగా..అత్యల్పంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఏడుగురు చేరారు. అనంతపురంలో బైపీసీ, అన్నమయ్య, కాకినాడ, నంద్యాల, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఈసీ గ్రూపులో ఒక్కరూ చేరలేదు. రెండో ఏడాది విద్యార్థులకు ఇంతవరకు ప్రాక్టికల్స్‌కు ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. సమీపంలోని ఆదర్శ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లి చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు