AP News: ‘వైఎస్సార్‌ పోషణ కిట్ల’లో పురుగులు

కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 13 Oct 2023 08:37 IST

గూడూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లను ఓ మహిళ గుర్తించారు. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివే గ్రామంలో మరో ఇద్దరికి సరఫరా అయినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు పాలూ బాగుండటం లేదని తెలిపారు. వేరుసెనగ చిక్కీలూ ప్యాకెట్లలో సగమే ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై సీడీపీవో గ్లోరిని వివరణ కోరగా కేవలం ఒకరిద్దరికి ఇచ్చిన ఖర్జూరే పాడైనట్లు తెలిసిందని, వెంటనే వారికి కొత్తవి ఇచ్చామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు