Bapatla: శభాష్‌ బాషా.. ఇంటి వ్యర్థాలతో రోడ్లపై గుంతలు పూడ్చిన కూలీ

గుంతలు పడిన రోడ్లకు ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయకపోయినా.. ఓ కూలీ మాత్రం సమాజహితం కోరి తన ఇంటిలోని వ్యర్థాలతో చినగంజాం, పల్లెపాలెం ఆర్‌అండ్‌బీ రహదారులపై ఉన్న గోతులను పూడ్చుతున్నారు.

Updated : 18 Jan 2024 09:05 IST

చినగంజాం, న్యూస్‌టుడే: గుంతలు పడిన రోడ్లకు ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయకపోయినా.. ఓ కూలీ మాత్రం సమాజహితం కోరి తన ఇంటిలోని వ్యర్థాలతో చినగంజాం, పల్లెపాలెం ఆర్‌అండ్‌బీ రహదారులపై ఉన్న గోతులను పూడ్చుతున్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మసీదుపేటకు చెందిన షేక్‌ బాషా ఉప్పు కొఠారుల్లో కూలీ పనులు చేస్తుంటారు. అతని పాతఇంటికి మరమ్మతులు చేయిస్తున్న క్రమంలో, ఆ ఇంటి నిర్మాణ వ్యర్థాలను బాషా బుధవారం ఆటోలో తెచ్చి రోడ్డుపై ఉన్న గుంతల్లో పోసి పూడ్చారు. అదిచూసిన పలువురు ఆయనను అభినందించారు. కాగా చినగంజాం, పల్లెపాలెం గ్రామాల మధ్య సుమారు నాలుగు కిలోమీటర్ల తారురోడ్డు ఉంది. ఆ రహదారిపై చాలావరకు గుంతలు పడటంతో వాహన చోదకులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని