కాలిలోని అతి పొడవు రక్తపు గడ్డ తొలగింపు.. డాక్టర్‌ సాయిపవన్‌ లిమ్కా రికార్డు

విజయవాడకు చెందిన కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అన్నే సాయిపవన్‌ అరుదైన శస్త్రచికిత్స ద్వారా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఇండియా (2024 ఎడిషన్‌)లో స్థానం సంపాదించారు.

Updated : 07 Mar 2024 07:55 IST

ఈనాడు, అమరావతి: విజయవాడకు చెందిన కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ అన్నే సాయిపవన్‌ అరుదైన శస్త్రచికిత్స ద్వారా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఇండియా (2024 ఎడిషన్‌)లో స్థానం సంపాదించారు. 63 ఏళ్ల వృద్ధుడి ఎడమ కాలిలోని 20 సెం.మీ. అతి పొడవు రక్తపు గడ్డను శస్త్రచికిత్స చేసి తొలగించారు. వృద్ధుడు గుండెజబ్బుతో విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎడమ కాలిలో రక్త ప్రసరణ ఆగి గడ్డ కట్టడాన్ని గుర్తించారు. అక్కడే ఆపరేషన్‌ చేసి రక్తపు గడ్డను తొలగించారు. గతేడాది ఆగస్టులో చెట్టుపై నుంచి పడిన ఒకరి ఛాతీ, పక్కటెముకల్లోకి వెదురుపుల్లలు చొచ్చుకెళ్లాయి. ఊపిరితిత్తుల చుట్టూ గాయాలతో పొరలు దెబ్బతిన్నాయి. శస్త్రచికిత్స చేసి వెదురుపుల్లలనూ పూర్తి స్థాయిలో డాక్టర్‌ సాయిపవన్‌ తొలగించారు. ప్రముఖ గుండెవైద్య నిపుణుడు డాక్టర్‌ ఎ.వి.ఆంజనేయులు కుమారుడే డాక్టర్‌ సాయిపవన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని