జ్యోతి సురేఖ విజయంతో దేశం గర్విస్తోంది: గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

షాంఘైలో జరుగుతున్న విలువిద్య ప్రపంచ కప్‌ స్టేజ్‌-1లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌, బృంద విభాగాల్లో హ్యాట్రిక్‌ స్వర్ణ పతకాలు సాధించిన జ్యోతి సురేఖ వెన్నంను రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందించారు.

Updated : 29 Apr 2024 06:37 IST

ఈనాడు, అమరావతి: షాంఘైలో జరుగుతున్న విలువిద్య ప్రపంచ కప్‌ స్టేజ్‌-1లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌, బృంద విభాగాల్లో హ్యాట్రిక్‌ స్వర్ణ పతకాలు సాధించిన జ్యోతి సురేఖ వెన్నంను రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందించారు. జ్యోతి సురేఖ అసాధారణ ప్రతిభకు దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.


వంటనూనె పునర్వినియోగంపై 300 కేసులు
ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వంటనూనె పునర్వినియోగం, నిషేధిత ఫుడ్‌ కలర్‌ను వాడుతున్న వ్యాపారులపై రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ వెల్లడించారు. వాటి వినియోగం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశమున్నందున కట్టడిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణీత వ్యవధిలో నమూనాలు సేకరించి, పరీక్షించాలని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని