Mahindra: మహీంద్రా సరికొత్త బొలెరో నియో

దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏడు సీట్ల మోడల్‌ బొలెరో నియోను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఎస్‌యూవీ కోసం చూస్తున్న వినియోగదారుల అవసరాలను....

Published : 14 Jul 2021 16:50 IST

ధర రూ.8.48 లక్షల నుంచి

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏడు సీట్ల మోడల్‌ బొలెరో నియోను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఎస్‌యూవీ కోసం చూస్తున్న వినియోగదారుల అవసరాలను కొత్త బొలెరో తీరుస్తుందని, అధునాతన లుక్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బొలెరో నియోతో పాటు ప్రస్తుత బొలెరో మోడల్‌ అమ్మకాలను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అగ్రగామి 10 ఎస్‌యూవీల్లో బొలెరో స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త నియో దోహదపడుతుందని కంపెనీ సీఈఓ ఆటోమోటివ్‌ విభాగం వీజే నక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్, ఐసోఫిక్స్‌ ఛైల్డ్‌ సీట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో అమర్చిన మహీంద్రా ఎంహాక్‌ ఇంజిన్‌ 100 హెచ్‌పీ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని