Elon Musk: మోదీతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.. ఎలాన్‌ మస్క్‌

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk) ఈ నెలలో భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.  

Updated : 11 Apr 2024 06:19 IST

Elon Musk | దిల్లీ: టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk) ఈ నెలలో భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీతోనూ భేటీ కానున్నారు. ఈ మేరకు భారత పర్యటన, ప్రధానితో భేటీని ధ్రువీకరిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మస్క్‌ స్పందించారు. మోదీతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. దిల్లీలో ఏప్రిల్‌ 22న ప్రధానితో మస్క్‌ భేటీ కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆపై తన ప్రణాళికలను వేరేగా వెల్లడించనున్నారని పేర్కొన్నాయి.

ఇండిగో సత్తా.. అమెరికా సంస్థను దాటేసి టాప్‌-3లోకి!

విద్యుత్‌ కార్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం టెస్లా ప్రతినిధులు భారత్‌లో సందర్శించనున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌ నెలలోనే ఈ పర్యటన ఉంటుందని ప్రచారం జరిగింది. మరోవైపు టెస్లా ప్లాంట్‌ను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇందులో గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. టెస్లాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. మరి ఏ రాష్ట్రంలో టెస్లా అడుగుపెట్టబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని