ప‌రిశీల‌న‌లోని ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స‌మాచారం

రీఅసెస్‌మెంట్ కేసులు కూడా ఇక‌పై ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ విధానంలోకి వ‌స్తాయి  

Published : 18 Dec 2020 14:14 IST

ఆదాయ పన్ను(ఐటీ) విభాగం తమ పరిశీలనలో ఉండే మదింపుదార్లకు ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ విషయంపై త్వరలో సమాచారాన్ని పంపనున్నట్లు ఒక పన్ను అధికారి తెలిపారు. 'అంతక్రితం నోటీసులు ఏమీ పక్కకు వెళ్లవు. ముందుగా ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ పథకం కింద మదింపు చేసే వారికి సమాచారం పంపిస్తాం.

ఒక వేళ మదింపు అధికారి మరింత సమాచారం కావాలని భావిస్తే సెక్షన్‌ 142(1) కింద తాజా నోటీసులు పంపిస్తార’ని సీబీడీటీ అదనపు కమిషనర్‌ జైశ్రీ శర్మ పేర్కొన్నారు. రీఅసెస్‌మెంట్‌ కేసులు కూడా ఇక ఫేస్‌లెస్‌ పథకంలో భాగంగా మారనున్నాయని స్పష్టం చేశారు. ఈ పథకంలో భాగంగా మదింపుదార్లకు, పన్ను అధికార్లకు మధ్య భౌతికంగా ఎటువంటి సంబంధాలు ఉండవు. అన్నీ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే జరుగుతాయి.

పన్ను చెల్లింపుదారులతో అన్ని కమ్యూనికేషన్లు ఇక‌పై ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ ద్వారా జ‌రుగుతాయ‌ని ఈ నెల ప్రారంభంలోనే తెలియ‌జేసింది. అటువంటి నోటీసులు అందుకున్న‌వారు పన్ను కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా లేదా ఏ అధికారిని కలవవలసిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో స్పందించవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు