రైలు ప్రమాద బాధితులకు వేగంగా క్లెయింల పరిష్కారం: ఐఆర్‌డీఏఐ ఆదేశం
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సంబంధించిన బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించాలని బీమా కంపెనీలను, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది.
ఈనాడు, హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సంబంధించిన బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించాలని బీమా కంపెనీలను, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. కష్టకాలంలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉందని, అర్హులైన వారి క్లెయింల పరిష్కారాన్ని వేగంగా చేయాలని తెలిపింది. బెంగళూరు-హావ్‌డా, కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురవడం వల్ల 275 మందికి పైగా మరణించడం, 1,000 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బాధితులకు ఆసరాగా నిలిచేందుకు ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
* ప్రతి బీమా సంస్థ ప్రత్యేకంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఉన్నతాధికారిని నోడల్ అధికారిగా నియమించి, క్లెయింలకు సంబంధించిన వివరాలన్నీ వెబ్‌సైట్లలో పెట్టాలని తెలిపింది. మరణించిన వారికి సంబంధించి అధికారులు ఇచ్చిన వివరాలను తీసుకుని, తమ పాలసీదారులలో వారెవరైనా ఉన్నారా అన్నదీ బీమా సంస్థలు పరిశీలించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్