Hyundai Motor: హ్యుందాయ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

Hyundai Motor: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్‌ ఇండియా తన సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెను నియమించుకుంది.

Published : 29 Dec 2023 21:48 IST

Hyundai Motor | చెన్నై: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్‌ ఇండియా (Hyundai Motor India)కు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని హుంద్యాయ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో షారుక్‌ తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి కార్ల తయారీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వారిలో రెండో వ్యక్తిగా దీపికా నిలిచారు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ధర తగ్గింపు.. ఈ కార్డులపై అదనపు డిస్కౌంట్‌

‘దీపికా పదుకొణెను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ ప్రేక్షకులతో ఆమెకు బలమైన బంధం ఉంది. ఈ నియామకంతో ఆమె వెండితెరకే కాకుండా విభిన్న ప్రేక్షకులకు దగ్గరవుతుంది. హ్యుందాయ్ వాహనాలు అధునాతనతకు అద్దం పడుతూ కొత్త ఆవిష్కరణలు తీసుకురానున్నాం’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్‌ అన్నారు. హ్యుందాయ్ మోటార్‌ ఇండియాకు తనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంపై దీపికా సంతోషం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్‌ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్‌ లాంటి సంస్థతో కలసి పనిచేయడం తనకు ఆనందంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని