OnePlus: వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ధర తగ్గింపు.. ఈ కార్డులపై అదనపు డిస్కౌంట్‌

OnePlus Nord 3 5G: వన్‌ప్లస్‌ ఈ ఏడాదిలో లాంచ్‌ చేసిన నార్డ్‌3 5జీ ఫోన్‌పై డిస్కౌంట్‌ ప్రకటించింది. ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.2వేలు డిస్కౌంట్‌ అందిస్తోంది.

Published : 29 Dec 2023 18:28 IST

OnePlus Nord 3 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: నార్డ్‌3 5జీ (OnePlus Nord 3 5G) మొబైల్‌పై వన్‌ప్లస్‌ (OnePlus) ప్రత్యేక డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది జులైలో వచ్చిన ఈ ఫోన్‌పై ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపింది. నార్డ్‌3 5జీ 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ ధర రూ.33,999గా కంపెనీ పేర్కొనగా.. ఆఫర్‌పై రూ.29,999కే కొనుగోలు చేయొచ్చు.

16 జీబీ + 256 జీబీ వేరియంట్‌ ధర రూ.37,999 కాగా.. రూ.4 వేల డిస్కౌంట్‌తో రూ.33,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మిస్టీ గ్రీన్‌, టెంపెస్ట్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌, వన్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.2 వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఆఫర్లు వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలోనూ అందుబాటులో ఉన్నాయి.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే..

  • 6.74 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌
  • ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13
  • 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్
  • సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా
  • 5,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని