Stock Market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు..

వారంతం ట్రేడింగ్‌ను దేశీయ మార్కెట్‌ సూచీలు లాభాల్లో మొదలుపెట్టాయి. 

Updated : 14 Jul 2023 09:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లు సహా దేశీయ సూచీలపై కూడా పడింది. అక్కడ ద్ర్యవోల్బణం తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెంచింది. వారంతం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఉదయం 9.22 సమయంలో నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 19,469 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 187 పాయింట్లు బలపడి 65,746 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక జేబీఎం ఆటో, లాయిడ్‌ స్టీల్స్‌, ఉజ్వాన్‌ ఫైనాన్స్‌, సన్‌టెక్‌ రియాల్టీ, సబెక్స్‌ షేర్లు లాభపడగా.. ఏజెల్‌ వన్‌, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్స్‌ 0.3శాతం పెరిగి 81.63 డాలర్లను తాకాయి. డబ్ల్యూటీఐ సూచీ 35 సెంట్లు లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.95 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. డోజోన్స్‌ 0.14, నాస్‌డాక్‌ 1.58, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.8శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 0.92, షాంఘై కాంపోజిట్‌ 0.29, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 0.47, జపాన్‌కు చెందిన నిక్కీ 0.23శాతం, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈఎస్‌ 50 ఇండెక్స్‌ 1.16శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని