Accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు.. నలుగురు విద్యార్థులు మృతి

ఓ పాఠశాల బస్సు, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 29 Jan 2024 20:42 IST

బాగల్‌కోట్‌: పాఠశాల బస్సు, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా అలగూరు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.  ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలయ్యాయి. ఈ విద్యార్థులంతా వర్ధమాన్‌ మహావీర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు.  వీరంతా ఆదివారం రాత్రి కవటగిరిలో పాఠశాల వార్షికోత్సవానికి హాజరై తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన విద్యార్థుల వయసు 13 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.  క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం సంతాపం.. మృతులకు పరిహారం

ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. మృతులకు తన సంతాపం ప్రకటించిన ఆయన.. విద్యార్థుల మృతిపై విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, క్షతగాత్రులకు ₹50వేలు  చొప్పున పరిహారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని