Shalu Chourasiya: షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన నిందితుడిపై పీడీ యాక్ట్

సినీనటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన నిందితుడిపై బంజారాహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

Published : 31 Mar 2022 01:32 IST

హైదరాబాద్‌: సినీనటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన నిందితుడిపై బంజారాహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గతేడాది నవంబర్‌లో కేబీఆర్‌ పార్క్‌కు నడకకు వెళ్లిన తనను ఓ వ్యక్తి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. సంపాదన సరిపోక అతడు చోరీలకు పాల్పడేవాడని దర్యాప్తులో తేలింది. గతంలో అతడిపై 3 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని