Chittoor: పోలీసుస్టేషన్‌ ఆవరణలో పేలిన జిలెటిన్‌ స్టిక్స్‌.. ధ్వంసమైన కిటికీలు, తలుపులు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీసుస్టేషన్‌ ఆవరణలో పేలుడు సంభవించింది. స్టేషన్‌ ఆవరణలో నిల్వ ఉంచిన నల్లమందు, జిలెటిన్‌ స్టిక్స్‌ శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా పేలిపోయాయి.

Updated : 08 Oct 2022 10:59 IST

గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీసుస్టేషన్‌ ఆవరణలో పేలుడు సంభవించింది. స్టేషన్‌ ఆవరణలో నిల్వ ఉంచిన నల్లమందు, జిలెటిన్‌ స్టిక్స్‌ శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా పేలిపోయాయి. మండల పరిధిలో క్వారీలకు అక్రమంగా రవాణా అవుతున్న నల్లమందు, జిలెటిన్‌ స్టిక్స్‌ను ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఉంచారు. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భారీ శబ్దంతో నల్లమందు, జిలెటిన్‌ స్టిక్స్‌ పేలిపోయాయి. దీంతోపాటు పక్కనే ఉన్న ద్విచక్రవాహనాలు కూడా దగ్ధమయ్యాయి. భారీ శబ్దానికి స్టేషన్‌తోపాటు సమీపంలోని ఇళ్లలోని కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. పేలుడు సంభవించిన సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని