గన్‌ మిస్‌ఫైర్: కానిస్టేబుల్‌ తలలోకి తూటా

తుపాకీ మిస్‌ఫైర్‌ అయి ఓ కానిస్టేబుల్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిన ఘటన కుమ్రంభీం అసీఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తుపాకుల క్లీన్‌ చేస్తుండగా...

Published : 23 Feb 2020 02:13 IST

తిర్యాని: తుపాకీ మిస్‌ఫైర్‌ అయి ఓ కానిస్టేబుల్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిన ఘటన కుమ్రంభీం అసీఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తిర్యాని పోలీస్‌ స్టేషన్‌లో తుపాకులు క్లీన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో కిరణ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చౌటపల్లికి చెందిన కిరణ్‌.. 132వ బెటాలియన్‌ బి- కంపెనీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని