షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌ అయ్యారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆమెను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు

Updated : 08 Jun 2020 19:17 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌ అయ్యారు. ఖాలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆమెను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌ను అధికారులు రిమాండ్‌కు తరలించారు. తాజా అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్టెయిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు తహశీల్దార్‌ నివాసంలో దొరికిన రూ.30లక్షల నగదు అంశంపైనా విచారణ జరుగుతోందని అనిశా అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన భూవివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఖాలీద్‌ అనే వ్యక్తి నుంచి ఆర్‌ఐ నాగార్జునరెడ్డి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగారు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న ఆర్‌ఐని, కేసు మాఫీ చేస్తానంటూ రూ.3 లక్షలు డిమాండ్‌ చేసిన ఎస్సై రవీంద్రనాయక్‌ని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేయడం వెనుక ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా? అనే అంశంపై అనిశా అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలో షేక్‌పేట్‌ మండల తహసీల్దార్‌ సుజాతను వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించారు. అలానే తహసీల్దార్‌ నివాసంలో శనివారం తనిఖీలో రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని