Andhra News: అనాథ దళిత యువతిపై వాలంటీరు అత్యాచారం

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతిపై గ్రామవాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Updated : 09 Feb 2023 07:33 IST

గర్భం దాల్చిన బాధితురాలు

మందస, న్యూస్‌టుడే: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతిపై గ్రామవాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన దళిత యువతి (27) తల్లిదండ్రులు కొన్ని నెలల క్రితం మరణించారు. నాటినుంచి ఆమె మందస మండలంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీఓ కార్యాలయ వరండాలో నిద్రిస్తోంది. దాదాపు నెల క్రితం అదే మండలంలోని జిల్లుండకు చెందిన గ్రామ వాలంటీరు కుణితి బాలకృష్ణ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో మంగళవారం మందస పోలీసులకు ఫిర్యాదుచేసింది. యువతి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదుచేశామని, గురువారం నిందితుడిని అరెస్టు చేస్తామని ఎస్సై రవికుమార్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని