ట్యాంకరును శుద్ధి చేసేందుకు దిగిన ఇద్దరు కూలీల మృతి

ట్యాంకరును శుద్ధి చేసేందుకు దిగిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 23 Mar 2023 04:16 IST

బూర్గంపాడు, న్యూస్‌టుడే: ట్యాంకరును శుద్ధి చేసేందుకు దిగిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లా కాంకెపుర గ్రామానికి చెందిన సోదరులు బుద్ధారాం(23), జోగ(21) లక్ష్మీపురంలోని ఓ కోడిగుడ్డు అట్టల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కర్మాగారంలోని పల్ప్‌ ట్యాంకర్‌ను శుద్ధి చేయడానికి ఇద్దరూ బుధవారం దిగారు. ట్యాంకర్‌ను శుద్ధి చేస్తున్న క్రమంలో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని మిగతా కార్మికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బుద్ధారాం, జోగలను బయటకు తీయడానికి దిగిన రాంబాబు అనే స్థానిక కార్మికుడు సైతం అస్వస్థతకు గురయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని