మంటల్లో చిక్కుకుని రైతు మృతి

పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Published : 04 May 2024 06:03 IST

సిరికొండ, న్యూస్‌టుడే: పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రమేశ్‌, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవాల్గోట్‌ గ్రామానికి చెందిన లాయిడి కిషన్‌ (48) అనే రైతు వానాకాలం పంట సాగుకు తన రెండెకరాల పొలం సిద్ధం చేయడానికి గురువారం మధ్యాహ్నం వరి కొయ్యలు, గడ్డికి నిప్పు పెట్టడానికి వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్ద వెతికినా చీకట్లో కనిపించలేదు. శుక్రవారం ఉదయం మళ్లీ పొలం వద్దకు వెళ్లి చూడగా కాలిపోయిన దేహంతో విగతజీవిగా కనిపించారు. పొలంలోని గడ్డికి నిప్పు పెట్టగా మంటలు అధికమవడంతో చెట్టు కొమ్మలతో ఆర్పే ప్రయత్నం చేస్తూ ఆ మంటల్లోనే చిక్కుకుని దహనమై ఉంటారని కుటుంబసభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. కిషన్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని